Aleru: ఆలేరులో రోడ్డుపై బైఠాయించిన మృతుడి కుటుంబ సభ్యులు!

Aleru: ఆలేరు బైపాస్ రోడ్డు ప్రమాదంలో బానోత్ యాకుబ్ మృతి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆలేరు పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన.

MAHENDER, ALERU
Published on: 17 July 2026 2:26 PM IST
Aleru
X

Aleru: ఆలేరులో రోడ్డుపై బైఠాయించిన మృతుడి కుటుంబ సభ్యులు!

Aleru: ఆలేరు బైపాస్‌లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్కాపేట (నర్మేట) గ్రామానికి చెందిన బానోత్ యాకుబ్ (50) మృతి చెందిన ఘటనలో ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఆలేరు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

యాకుబ్ అల్లం, ఎల్లిగడ్డ వ్యాపారం చేస్తూ హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

MAHENDER, ALERU

MAHENDER, ALERU

Next Story