Huzurnagar: న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: జక్కుల వీరయ్య
Huzurnagar: హుజూర్‌నగర్‌లోని రామస్వామి గట్టు వద్ద న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల వీరయ్య యాదవ్ ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు.
Huzurnagar: న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: జక్కుల వీరయ్య
హుజూర్‌నగర్: న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హుజూర్‌నగర్‌లోని రామస్వామి గట్టు వద్ద న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, మాజీ కౌన్సిలర్ జక్కుల వీరయ్య యాదవ్ మాట్లాడుతూ న్యాయవాదులు సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామస్వామి గట్టు వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించేలా సంబంధిత అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.




