Nalgonda: తెలంగాణ క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్ సంచలన స్కీమ్స్!

Nalgonda: 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను క్రైస్తవ మైనారిటీ సంక్షేమ పథకాలైన కుట్టు మిషన్లు, ఈ-బైక్‌ల కొరకు జూలై 18 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు

Saleem, Nalgonda
Published on: 7 July 2026 10:22 PM IST
Nalgonda
X

Nalgonda: తెలంగాణ క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్ సంచలన స్కీమ్స్!

నల్గొండ: తెలంగాణ క్రైస్తవ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి టి. విజయేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

​అందుబాటులో ఉన్న పథకాలు - వయోపరిమితి:

​కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్లు (పెట్టీ బిజినెస్): 21 నుంచి 55 ఏళ్ల లోపు వారు అర్హులు.

​ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ పథకాలు: 21 నుంచి 50 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

​ఆదాయ పరిమితి:

​గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.1,50,000/- లోపు ఉండాలి.

​పట్టణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.2,00,000/- లోపు ఉండాలి.

​ముఖ్య గమనిక: అర్హత గల అభ్యర్థులు ఈ నెల 18-07-2026 సాయంత్రం 5:00 గంటల లోపు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

​జిల్లాలోని క్రైస్తవ మైనారిటీ ప్రజలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంక్షేమ అధికారి విజ్ఞప్తి చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story