Miryalaguda: ఎస్సీ కుటుంబంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి: BLF!

Miryalaguda: మిర్యాలగూడ గాంధీనగర్‌లో ఎస్సీ కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని కోరుతూ BLF, దళిత సంఘాలు నల్గొండ ఎస్పీకి వినతిపత్రం ఇచ్చాయి.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 17 Nov 2026 2:18 PM IST
Miryalaguda
X

Miryalaguda: ఎస్సీ కుటుంబంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి: BLF!

మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌లో ఎస్సీ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని BLF, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్గొండ జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని ఎస్పీని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో BLF రాష్ట్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్య, దళిత సంఘాల నాయకులు దైద సత్యం, ఎస్.డి. ఫరూఖ్, మొండికత్తి లింగయ్య, మాచర్ల సైదులు, మడుపు శ్రీను, BSP నాయకులు పుట్టల దినేష్, శరత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA