Suryapet: ఈనెల 25న కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభ!

Suryapet: ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న సంతాప సభ జూలై 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. సూర్యాపేటలో పోస్టర్ ఆవిష్కరించిన అరుణోదయ నేత ఉదయగిరి.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 23 July 2026 10:31 AM IST
Suryapet
X

Suryapet: ఈనెల 25న కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభ!

Suryapet: ప్రజా గాయకుడు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభను ఈనెల 25న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయగిరి తెలిపారు.

ఈ సంతాప సభను కవులు, కళాకారులు, కళాభిమానులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం నందు నాగన్న సంతాప సభను విజయవంతం చేయాలంటూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయగిరి మాట్లాడుతూ, కామ్రేడ్ నాగన్న 50 ఏళ్ల సాంస్కృతిక ఉద్యమంలో అనేక మంది కళాకారులను తయారు చేసిన గొప్ప సాంస్కృతిక ఉద్యమ నాయకుడని కొనియాడారు. అనేక కష్టనష్టాలను ఎదుర్కొని, పోలీసు నిర్బంధాలను చవిచూసి కూడా నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాల బాటలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచనపల్లి సైదులు, ఎర్ర ఉమేష్, జిల్లా కమిటీ సభ్యులు బొల్లె వెంకన్న, గండు నగేష్, సామ నర్సిరెడ్డి, స్వర్ణ, కోటయ్య, సంజీవరెడ్డి, పిడమర్తి భరత్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story