Suryapet: అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం
Suryapet: అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణస్వీకారం. పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేల్. చైర్మన్‌గా బీరవోలు విక్రంరెడ్డి బాధ్యతలు.
Suryapet: అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం
సూర్యాపేట జిల్లా: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ చైర్మన్‌గా బీరవోలు విక్రంరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ బీరవోలు విక్రంరెడ్డి మాట్లాడుతూ.. దేవస్థానం చైర్మన్‌గా తనను ప్రతిపాదించి, ఎన్నుకునేలా సహకరించిన ఎమ్మెల్యే మందుల సామేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో తనకు ఈ గొప్ప అవకాశం లభించిందని, ఇది తనకు ఎంతో అదృష్టంగా, భాగ్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పవిత్ర దేవస్థానానికి సేవ చేసే అవకాశం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో పాటు అందరి సహకారంతో దేవస్థానానికి మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని బీరవోలు విక్రంరెడ్డి అన్నారు.




