Chityala: జల్సాల కోసం నేరగాడిగా మారిన పోస్ట్‌మాస్టర్

Chityala: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విలాసాలకు అలవాటు పడిన ఒక అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ సైబర్ నేరగాడిగా మారి నల్గొండ పోలీసులకు చిక్కాడు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 29 April 2026 9:05 PM IST
Chityala
X

Chityala: జల్సాల కోసం నేరగాడిగా మారిన పోస్ట్‌మాస్టర్

Chityala: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పోస్టుమాస్టర్ గా పనిచేస్తూ హాయిగా జీవించాల్సిన యువకుడు చెడు అలవాట్లు ఉన్న స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడి సైబర్ నేరాలకు పాల్పడుతూ నలగొండ జిల్లా పోలీసులకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన బుద్ధ హేమ సాయి అనకాపల్లి బ్రాంచ్లో అస్టెంట్ పోస్టుమాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

కాకినాడ సంబంధించిన ఇంకో ముగ్గురితో కలిసి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఆటోనగర్ లో ఈనెల 25వ తేదీన ఏటీఎం వద్ద నిలబడి ఏటీఎంలో డబ్బులు జమ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఏ మార్చి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తామని ఫేక్ యాప్ ద్వారా డబ్బులు పంపినట్టు మెసేజ్ చూపించి 13000 తీసుకొని పరారయ్యారు.

ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ కు పోతున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో నలగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటుచేసి వాహన తనిఖీలు చేపట్టారు పోలీసులను గమనించిన నిందితులు కారును వెనకకు తిప్పి పోలీసుల కళ్ళు కప్పి చిట్యాల చివర్లో ఒక వెంచర్లు లో వదిలి వెళ్లిపోయారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ఒకరైన హేమ సాయిని అరెస్టు చేశారు ఇంకొక ముగ్గురి కొరకు వేట కొనసాగిస్తున్నారు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA

Next Story