Nalgonda: నల్లగొండలో ఆటో బంద్: రవాణా స్తంభన, కార్మికుల ఆందోళన!

Nalgonda: నల్లగొండలో ఆటో కార్మికుల సమ్మె. బైక్ టాక్సీలను నిషేధించాలని, కనీస ఛార్జీలు పెంచాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Jun 2026 2:14 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో ఆటో బంద్: రవాణా స్తంభన, కార్మికుల ఆందోళన!

Nalgonda: నల్లగొండ పట్టణంలో ఆటో కార్మికులు అకస్మాత్తుగా చేపట్టిన బంద్‌తో రవాణా వ్యవస్థ స్తంభించింది. తమ ఉపాధిని దెబ్బతీస్తున్న బైక్ టాక్సీలపై చర్యలు తీసుకోవాలని, ఇంధన ధరలకు అనుగుణంగా కనీస ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రోడ్డెక్కారు.

నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. పట్టణ పరిధిలో ఆటో కనీస ఛార్జీలను (మినిమం ఫేర్) పెంచాలని కోరుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ, తమ పొట్టగొడుతున్న ‘ర్యాపిడో’ వంటి ప్రైవేట్ బైక్ టాక్సీల రవాణాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story