Anneparthy: అన్నెపర్తి 12వ బెటాలియన్ కమాండెంట్‌గా బి.రామకృష్ణ బాధ్యతలు!
Anneparthy: నల్లగొండ జిల్లా అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ కమాండెంట్‌గా బి.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తానని ఆయన తెలిపారు.
Anneparthy: అన్నెపర్తి 12వ బెటాలియన్ కమాండెంట్‌గా బి.రామకృష్ణ బాధ్యతలు!
అన్నెపర్తి: అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ కమాండెంట్‌గా శ్రీ బి.రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. సాయుధ బలగాల గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) స్వీకరించిన అనంతరం ఆయన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ ఎల్.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. బెటాలియన్ పురోగతి, సిబ్బంది సంక్షేమం, క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి బెటాలియన్‌కు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
Next Story




