Nakrekal: నకిరేకల్‌లో 'బడి బాట': పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం!
Nakrekal: నకిరేకల్ జెడ్పీ పాఠశాలలో 'బడి బాట' పోస్టర్ ఆవిష్కరణ. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం.
Nakrekal: నకిరేకల్‌లో 'బడి బాట': పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం!
నకిరేకల్: నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “బడి బాట” కార్యక్రమ పోస్టర్‌ను ప్రభుత్వ విప్ & నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు.
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Next Story




