Nalgonda: నల్గొండలో ‘కుర్బానీ’ సెగ.. అమాంతం పెరిగిన మేకలు, గొర్రెల ధరలు!
Nalgonda: నల్గొండ జిల్లాలో బక్రీద్ పండుగ వేళ మేకలు, గొర్రెపోతులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
Nalgonda: నల్గొండలో ‘కుర్బానీ’ సెగ.. అమాంతం పెరిగిన మేకలు, గొర్రెల ధరలు!
Nalgonda: బక్రీద్ పండుగ వేళ జిల్లాలో మేకలు, గొర్రెపోతులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈసారి కుర్బానీ (త్యాగం) కొరకు ఆవుల విక్రయాలపై నిషేధం ఉండటంతో, ముస్లిం సోదరులంతా ప్రత్యామ్నాయంగా మేకలు, గొర్రెల కొనుగోలు వైపు మొగ్గు చూపారు. దీనిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ధరలకు రెక్కలు తొడిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గొర్రెల సంతల్లో ధరలను అమాంతం పెంచేశారు. సామాన్యుడు సైతం కొనుగోలు చేయాలన్నా కనీసం రూ. 10,000 తగ్గకుండా రేట్లు చెప్తుండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. పండుగ పూట తప్పనిసరి పరిస్థితుల్లో భారీ ధరలు వెచ్చించి జీవాలను కొనుగోలు చేయాల్సి వస్తోందని ముస్లిం పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story




