Suryapet: మూతపడిన బార్లు.. ప్రివిలేజ్ ట్యాక్స్ పెంపుపై నిరసన!
Suryapet: బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ప్రివిలేజ్ ట్యాక్స్ పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లాలో సోమవారం బార్లు బంద్ పాటించారు.
Suryapet: మూతపడిన బార్లు.. ప్రివిలేజ్ ట్యాక్స్ పెంపుపై నిరసన!
Suryapet: బార్ అండ్ రెస్టారెంట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రివిలేజ్ ట్యాక్స్ పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం జిల్లాలో బార్లు బంద్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉదయం నుంచి బార్లు మూతపడ్డాయి.
ఈ సందర్భంగా జిల్లా బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ నాయకులు గవ్వ కృష్ణారెడ్డి, రంగరాజు రుక్మారావు లు మాట్లాడుతూ, బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. పన్నులు పెంచడం వల్ల బార్ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే పెంచిన ప్రివిలేజ్ ట్యాక్స్ను తగ్గించాలని, బార్ యజమానులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో బార్ యాజమాన్యం మోదుగు కృష్ణారెడ్డి, కె హరి ప్రసాద్, మండాది శ్రీనివాస్, రాపర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




