Bhongir: కాంగ్రెస్ పీఏసీ భేటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరం

Bhongir: మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు.

Saleem, Nalgonda
Published on: 17 Aug 2026 9:26 PM IST
Bhongir
X

Bhongir: కాంగ్రెస్ పీఏసీ భేటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరం

భువనగిరి: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన భువనగిరి పట్టణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం అత్యంత కీలక వాతావరణంలో జరిగింది. ఈ భేటీకి రాష్ట్ర మంత్రులు, నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

​పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అయితే, ఈ అత్యంత ముఖ్యమైన భేటీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు కావడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

​ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాజగోపాల్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టడంపై రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story