Nalgonda: నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి బీజేపీ!

Nalgonda: సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ నిరసనల్లో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ కలెక్టర్‌కు బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వినతి.

Saleem, Nalgonda
Published on: 12 Oct 2026 6:55 PM IST
Nalgonda
X

Nalgonda: నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి బీజేపీ!

Nalgonda: సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ తరహా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

​ఈ నెల 10న గడియారం సెంటర్‌లో యూటీఎఫ్, డీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములై, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనడం సరైంది కాదన్నారు. కలెక్టర్, బీఎల్‌ఓల స్థాయి అధికారుల తీరును నిరసించడం సేవా నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. బాధ్యుల ఫొటో ఆధారాలను కలెక్టర్‌కు అందజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కళ్యాణ్ నాయక్, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda