Nalgonda: నల్గొండలో వైభవంగా ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు!

Nalgonda: నల్గొండ పాతబస్తీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు కోలాహలంగా జరిగాయి.

Saleem, Nalgonda
Published on: 10 Aug 2026 6:03 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో వైభవంగా ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు!

​నల్గొండ: నల్గొండ పట్టణం లోని పాతబస్తీ హనుమాన్‌నగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిళ్ల కాశమ్మ ఆధ్వర్యంలో ఆషాఢ మాస గోరింటాకు సంబరాలు సోమవారం వైభవంగా సాగాయి. ముందుగా మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.

అనంతరం ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ​ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, రాష్ట్ర నాయకురాలు కూతురు విజయ, ‘మన్ కీ బాత్’ కన్వీనర్ నెవెర్స్ నీరజ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story