Huzurnagar: హుజూర్‌నగర్‌లో పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే!

Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ 15వ వార్డుకు చెందిన దివంగత కుడితొట్టి అబ్రహం కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 4 Nov 2026 1:44 PM IST
Huzurnagar
X

Huzurnagar: హుజూర్‌నగర్‌లో పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే!

Huzurnagar: పట్టణంలోని 15వ వార్డుకు చెందిన ఇటీవల మృతి చెందిన కుడితొట్టి అబ్రహం కుటుంబానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆర్థిక సహాయం అందించారు.

గతంలో అబ్రహం కుటుంబాన్ని పరామర్శించిన శానంపూడి సైదిరెడ్డి వారి దీనస్థితిని తెలుసుకొని, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు తన తరఫున బీజేపీ పట్టణ నాయకుల ద్వారా కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్, జిల్లా నాయకులు బెల్లంకొండ నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి రామారావు, దళిత మోర్చా నాయకులు మేళ్లచెరువు లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షుడు పైడిమర్రి విజయ్, యువ మోర్చా అధ్యక్షుడు బల్వంత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR