Kanagal: అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై బీజేపీ ఆగ్రహం – భారీ మౌన ప్రదర్శన

Kanagal: కనగల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై బీజేపీ నిరసన. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మౌన ప్రదర్శన.

Saleem, Nalgonda
Published on: 24 Aug 2026 2:39 PM IST
Kanagal
X

Kanagal: అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై బీజేపీ ఆగ్రహం – భారీ మౌన ప్రదర్శన

కనగల్: నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనుల సమయంలో ప్రమాదవశాత్తు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసమవ్వడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ఈ సంఘటనకు కారణమైన వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ ఘటనను నిరసిస్తూ నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి నల్గొండ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మౌన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా చౌరస్తాలో నిరసన తెలుపుతూ విగ్రహ ధ్వంసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story