Miryalaguda: గత పాలనపై సమాధానం చెప్పకే KTR మిర్యాలగూడకు రావాలి!

Miryalaguda: ఉనికి కోసమే BRS రైతు సభ కాంగ్రెస్ పాలనపై ఓర్వలేకనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.

Saleem, Nalgonda
Published on: 3 Sept 2026 7:00 PM IST
Miryalaguda
X

Miryalaguda: గత పాలనపై సమాధానం చెప్పకే KTR మిర్యాలగూడకు రావాలి!

Miryalaguda: తమ ఉనికిని కాపాడుకోవడానికే బిఆర్ఎస్ పార్టీ ఈ రైతు సభను నిర్వహిస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. గత పాలనపై రైతులకు స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతే కేటీఆర్ మిర్యాలగూడలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.

​ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను, రైతులను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకే ఇలాంటి నిరసనలకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story