Nalgonda: కాంగ్రెస్ వైఫల్యాలపై నల్లగొండలో బీఆర్‌ఎస్ భారీ ఆటో ర్యాలీ!
Nalgonda: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నల్లగొండలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నాయకత్వంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహణ.
Nalgonda: కాంగ్రెస్ వైఫల్యాలపై నల్లగొండలో బీఆర్‌ఎస్ భారీ ఆటో ర్యాలీ!
Nalgonda: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఆటో ర్యాలీ నిర్వహించాయి. వందలాది ఆటోలతో పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ నిరసనలో కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఒక ఆటోపైకి ఎక్కి కూర్చొని ప్రదర్శనగా వెళ్లడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. పట్టణంలో ఆటోలపై చక్కర్లు కొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయన ఆటో రైడ్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు.
Next Story




