Maddirala: కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి!

Maddirala: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మద్దిరాలలో బీఆర్‌ఎస్ సమరభేరి. చౌరస్తా నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ, ప్రజావాణిలో వినతిపత్రం అందజేత.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 7 Sept 2026 5:06 PM IST
Maddirala
X

Maddirala: కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి!

మద్దిరాల: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మద్దిరాల మండల కేంద్రంలో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు.

మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్.ఏ. రజాక్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మద్దిరాల చౌరస్తా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాం రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షులు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి, కోడి శ్రీను, వడ్డాణం మధుసూదన్, సర్పంచ్‌లు రాంపాక నాగరాజు, బుక్యా వీరన్న, మునగాల భాస్కర్ రావు, మీసాల సాగారికా మోహన్, తదితరులు పాల్గొన్నారు.

అలాగే లావుడియా వెంకన్న, మారెల్లి యాకయ్య, సూరినేని తిర్మల్ రావు, వల్లపు యాకయ్య, సురారపు రాజు, గాడుదుల లింగరాజు, జీలకర చంద్రసమౌళి, రేసు జగదీష్, బద్దం అమృతా రెడ్డి, సంజీవ రెడ్డి, రేసు వెంకన్న, బొబ్బిలి వెంకన్న, నాగేల్లి శ్రావణ్, మల్లాల నర్సయ్య, వెలుగు వెంకన్న, బెడద వెంకన్న, గుగులోతు రవి, బూర్గుల బాను, శేరి దామోదర్ రెడ్డి, సాధు భాస్కర్ రెడ్డి, రాంపాక మురళి, చామకూరి బిక్షం, తాళ్లపల్లి బోస్, యాకయ్య, పళ్ల శ్రీకాంత్, కొనతం సురేష్, కోమరయ్య, లింగయ్యతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, యువకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy

Next Story