Chityala: చిట్యాల సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా!

Chityala: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సబ్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతులకు కరెంటు కోతలపై భారీ ధర్నా నిర్వహించారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 14 Oct 2026 12:24 PM IST
Chityala
X

Chityala: చిట్యాల సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా!

Chityala: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సబ్ స్టేషన్ ముందు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రైతులకు 24 గంటల కరెంటు అందించడం లేదని, లో వోల్టేజీ సమస్యతో రైతుల మోటార్లు కాలిపోతున్నాయని వర్షాలు లేక ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నారని కరెంటు కోత తో రైతులను ప్రభుత్వo ఇబ్బంది పెడుతుందని అన్నారు.

గతంలో కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కెసిఆర్ ప్రభుత్వం చేసిందని, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.

ఎనిమిది గంటల కరెంటు అని చెప్పి ఐదు ఐదున్నర గంటలు మాత్రమే ఇస్తున్నారని, దీంతో రైతుల మోటార్లు స్టార్టర్లు కాలిపోతున్నాయని గ్రామాలలో ఎకరాల కొద్ది భూములు ఎండిపోతున్నాయని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు సక్రమంగా కరెంటు అందగాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA