Nalgonda: దేవరకొండలో బీఆర్ఎస్ రాస్తారోకో సాగునీటి కోసం రైతుల ఆందోళన
Nalgonda: నల్గొండ పెద్దదశర్లపల్లి వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో. సాగర్ ఎడమ కాలువ కింద సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిమాండ్.
Nalgonda: దేవరకొండలో బీఆర్ఎస్ రాస్తారోకో సాగునీటి కోసం రైతుల ఆందోళన
Nalgonda: మా నీళ్లు మాకు కావాలంటు బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఉమ్మడి పెద్దదశర్లపల్లి మండల కేంద్రంలోని గణపురం స్టేజి వద్ద రైతులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి మండల కేంద్రంలోని చెరువులని ఎండబెడుతూ నల్గొండలోని ఉదయ సముద్రానికి నీరు తరలిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
స్థానిక ఎమ్మెల్యే మాత్రం సోయిలేదని అన్నారు. కెసిఆర్ హయాంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ క్రింద బ్రహ్మాండంగా రైతులకు నిలవడం జరిగిందని ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల సోయ ఉంటే రెండు పంటలకు మహాధర్మం నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. సాగర్ ఎడమ కాలువ కింద రైతులకు సాగునీరు అందించాలని గుడిపల్లి పీఏపల్లి మండలాలలోని చెరువులు కుంటలు నింపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో నాగార్జునసాగర్కు చుక్క నీరు రాకుండా పోతిరెడ్డిపాడు నీరు తరలిస్తున్నారని 25 వేల క్యూసెక్కుల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తుంటే నాగార్జునసాగర్ వచ్చే పరిస్థితి లేదని గతంలో నాగార్జునసాగర్ నిండింతవరకు పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోవడానికి వెళ్లేదని ఎవరి ఆదేశాలతో పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్య నాయక్ మండల అధ్యక్షుడు వల్లపురెడ్డి సీనియర్ నాయకులు మాధవరావు తోటకూర పరమేష్,మధు సుధాకర్ గౌడ్, సర్పంచులు ఆడెపు నగేష్ రాజశేఖర్ రెడ్డి శ్రీను అర్వపల్లి నరసింహ బొట్టుపల్లి మహేందర్ నరేందర్ ఎర్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు.




