Nuthankal: నూతనకల్‌లో బీఆర్‌ఎస్ ధర్నా నిలిచిపోయిన ట్రాఫిక్
Nuthankal: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుకు నిరసనగా సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల ధర్నా, రాస్తారోకో.
Nuthankal: నూతనకల్‌లో బీఆర్‌ఎస్ ధర్నా నిలిచిపోయిన ట్రాఫిక్
Nuthankal: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్: అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలిరావడంతో నూతనకల్ ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్, మాజీ సర్పంచ్ కనకటి వెంకన్న, నూతనకల్ సర్పంచ్ మల్లికార్జున్, ఎర్రపహాడ్ సర్పంచ్ గాడిదల లింగరాజు యాదవ్, ఎడవల్లి సర్పంచ్ జటంగి సరిత కృష్ణ, పెదనమేల సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, మట్టిపల్లి సతీష్ యాదవ్, కారింగుల మహేష్ గౌడ్, మండల ఉమేష్, పెద్దింటి మధు యాదవ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




