Kodad: కోదాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ నిరసన ర్యాలీ!
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడలో పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
Kodad: కోదాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ నిరసన ర్యాలీ!
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని నిరసనకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆరోపించారు.
తక్షణమే బకాయిలన్నీ విడుదల చేసి విద్యార్థుల చదువుకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే రోజుల్లో విద్యార్థులను కలుపుకుని ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.




