Huzurnagar: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం: జగదీష్ రెడ్డి
Huzurnagar: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ వైఫల్యాలు, కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్‌కు సవాల్ విసిరారు.
Huzurnagar: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం: జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా: హుజూర్‌నగర్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రంలో కరువు వచ్చిందని, కృష్ణా నీటిని సరిగా వాడుకోకుండా ఆంధ్రకు తరలించారని విమర్శించారు.
కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే సూర్యాపేట వరకు నీళ్లు వస్తాయని, ఈ విషయమై ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని తెలిపారు. నిరుద్యోగులు, రైతుల జీవితాలను కాంగ్రెస్ చిన్నాభిన్నం చేసిందని, హుజూర్‌నగర్‌లో అవినీతి దందాలు రాజ్యమేలుతున్నాయని జగదీష్ రెడ్డి ఆరోపించారు.




