Miryalaguda: నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ మహిళా శ్రేణుల భారీ ర్యాలీ!

Miryalaguda: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి, పోలీసుల తీరును నిరసిస్తూ మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేపట్టారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 8 Sept 2026 10:26 PM IST
Miryalaguda
X

Miryalaguda: నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ మహిళా శ్రేణుల భారీ ర్యాలీ!

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బిఆర్ఎస్ పార్టీ మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు నిన్న అసెంబ్లీ వద్ద బి ఆర్ ఎస్ మహిళ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో మహిళలు నల్ల బ్యాడ్జీలతో పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కూని చేస్తుందంటూ రైతు బజార్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే అధికారం అందరికీ ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు అసెంబ్లీ వద్ద నిరసనలు తెలిపిన మహిళ ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం హేయమైన చర్యకు పాల్పడిందన్నారు మహిళల పట్ల పోలీస్ అధికారుల తీరును ఖండిస్తున్నామన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story