Thungathurthi: తుంగతుర్తి మండలం వెంపటిలో దారుణ హత్య: యువకుడి హతం!

Thungathurthi: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో చామకూరి మహేష్ (25) అనే యువకుడిని శుక్రవారం గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 20 Nov 2026 4:11 PM IST
Thungathurthi
X

Thungathurthi: తుంగతుర్తి మండలం వెంపటిలో దారుణ హత్య: యువకుడి హతం!

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి యువకుడిని హత్య చేసిన ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. వెంపటి గ్రామానికి చెందిన చామకూరి యాదయ్య కుమారుడు చామకూరి మహేష్ (25)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. మృతుడికి భార్య ఉన్నట్లు తెలిసింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమా? లేక ఇతర వివాదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

యువకుడి హత్యతో వెంపటి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిందితులు ఎవరు, హత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటనే పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy