Nakrekal: ఇటుకులపహాడ్ బీటీ రోడ్డు పనుల పరిశీలన!
Nakrekal: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపహాడ్ బీటీ రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు. ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని హర్షం.
Nakrekal: ఇటుకులపహాడ్ బీటీ రోడ్డు పనుల పరిశీలన!
Nakrekal: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధవరం కలాన్ ఎక్స్ రోడ్డు నుంచి ఇటుకులపహాడ్ గ్రామ వరకు 3.కి. మీ వరకు 3.50 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింత ధనంజయ గారు ఆదివారం ఇటుకులపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింత ధనంజయ గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇటుకులపహడ్ గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని ,అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. రోడ్డు నిర్మాణం కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి కేసులు ఎదుర్కుని అనేక కష్టాలను ఎదుర్కొని పోరాటం చేసి రోడ్డును సాధించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి నేడు పూర్తి చేసుకోవడం హార్శించదగ్గ విషయం. రోడ్డు నిర్మాణానికి సహకరించిన రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి , తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు గారికి , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు తోటకూరి పరుశురాములు,గ్రామ సర్పంచ్ ఇంద్రకంటి సుమలత శ్రీనివాస్,ఉప సర్పంచ్ సుల్తాన్ ఎల్లయ్యా, మార్కెట్ డైరెక్టర్ గైగుల్లా ఐలయ్య, ఇటుకలపహాడ్, జాలోనిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కాంచని నాగరాజు, జమ్ము అశోక్, తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ ,మాజీ ఉపసర్పంచ్ శేషరాజుపల్లి రాంచంద్రు, కాంగ్రెస్ నాయకులు కొర్రపిడుత నాగరాజు, సుల్తాన్ రమేష్,డి. కే. మూర్తి, తాటిపాముల సురేష్, కన్నం వెంకన్న, మొదాల అశోక్ , సూరారంపూ శ్రీను, ఇంద్రకంటి అంజయ్య, మేడిపల్లి శ్రీనివాస్, నారగాని మహేష్, రేఖల బాబు, యంగలి లింగస్వామి తదితరులు ఉన్నారు.




