Nakrekal: నకిరేకల్‌లో దొంగల బీభత్సం..నిర్మాణంలో ఉన్న ఇళ్లే టార్గెట్!

Nakrekal: నకిరేకల్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. సంతోష్ నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో ప్రవేశించి లక్షలాది రూపాయల విలువైన విద్యుత్ వైర్లను అపహరించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 1 Nov 2026 12:22 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్‌లో దొంగల బీభత్సం..నిర్మాణంలో ఉన్న ఇళ్లే టార్గెట్!

Nakrekal: నకిరేకల్ పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విలువైన సామగ్రిని అపహరిస్తున్నారు. తాజాగా పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీలో చర్చి పక్కన నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది.

స్థానికంగా పెట్రోల్ బంక్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఆకుల శ్రీనివాస్‌కు చెందిన ఇంట్లో తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల విలువైన విద్యుత్ వైర్లను ఎత్తుకెళ్లారు. ఇదే తరహాలో పట్టణంలోని పలు కాలనీల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దొంగలు విద్యుత్ వైర్లు, ఫర్నిచర్‌తో పాటు ఇతర విలువైన సామగ్రిని అపహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చోరీలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL