Huzurnagar: హుజూర్నగర్ బైపాస్ రోడ్డుపై ప్రమాదకరంగా సిమెంట్ గూనలు!
Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ బైపాస్ రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న సిమెంట్ గూనలను తక్షణమే తొలగించి, ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలని స్థానికుల డిమాండ్.
Huzurnagar: హుజూర్నగర్ బైపాస్ రోడ్డుపై ప్రమాదకరంగా సిమెంట్ గూనలు!
Huzurnagar: పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు వైపు నుంచి మట్టపల్లి, మేళ్లచెరువు ప్రాంతాలకు వెళ్లే బైపాస్ రోడ్డుపై అడ్డుగా ఉన్న సిమెంట్ గూనలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై అడ్డంకుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గం మీదుగా సిమెంట్ పరిశ్రమలకు వెళ్లే భారీ వాహనాలు నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి రద్దీ మార్గంలో సిమెంట్ గూనలు అడ్డుగా ఉండటం వల్ల భారీ వాహనాలతో పాటు ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే రద్దీగా ఉండే ఈ రహదారిపై అడ్డంకులు కొనసాగితే వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించాలి
సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రోడ్డుపై అడ్డుగా ఉన్న సిమెంట్ గూనలను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




