Nalgonda: పెంచిన ఇంధన ధరలను తక్షణమే రద్దు చేయాలి.. కేంద్రంపై నారీ ఐలయ్య ఫైర్!
Nalgonda: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య.
Nalgonda: పెంచిన ఇంధన ధరలను తక్షణమే రద్దు చేయాలి.. కేంద్రంపై నారీ ఐలయ్య ఫైర్!
నల్లగొండ జిల్లా: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలపై భారాలు మోపుతూ, విడతలవారీగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ కోలుకోలేని షాక్ ఇస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.గటుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.గ్యాస్, బంగారం ధరలు పెరిగి జనం అల్లాడుతున్నారని అన్నారు.
Next Story




