Miryalaguda: మిర్యాలగూడలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు!
Miryalaguda: మిర్యాలగూడలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ నివాళులర్పించారు.
Miryalaguda: మిర్యాలగూడలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు!
Miryalaguda: తెలంగాణ సాయుద పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించినారు.పోగుల సైదులు గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాల యోధురాలు మరియు తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు.
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారినీ ఆదర్శంగా తీసుకోని బీసీలంతా ఏకమై బహుజన రాజ్యాధికారం స్థాపన దిశగా అడుగులు వేయాలన్నారు. ఐలమ్మ గారి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినప్పటికీ నిర్వహణ కార్యక్రమంలో బీసీలకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు అందుకే బహుజనలంతా ఏకమై ఐలమ్మ జీవితం స్ఫూర్తితో బీసీ రాజ్యాధికారము ఏర్పాటు చేసుకొని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు .
ఈ కార్యక్రమంలో బిజీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు బిసి సంఘం నాయకులు శ్రీనివాస్ శివరామకృష్ణ వెంకన్న తదితరులు పాల్గొన్నారు




