Nalgonda: మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి!
Nalgonda: నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకులు. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు.
Nalgonda: మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి!
Nalgonda: నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గల రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో శనివారం వీరనారి చాకలి ఐలమ్మ 131జయంతిని ఘనంగా నిర్వహించారు. నల్లగొండ మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె పోరాటాన్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పిఏ ఏదుళ్ళ మధుసూదన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల కోటి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాదం అనిల్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, పెరిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.




