Chandampet: రైతుల విత్తన తిప్పలపై కలెక్టర్‌తో మాట్లాడిన కల్వకుంట్ల కవిత

Chandampet: చందంపేట రైతు వేదిక వద్ద వేరుశనగ విత్తనాల కోసం వేచి ఉన్న రైతమ్మలను పరామర్శించిన కల్వకుంట్ల కవిత. కలెక్టర్‌తో మాట్లాడి విత్తనాలు పంపిణీ చేయించిన నేత.

Saleem, Nalgonda
Published on: 7 Nov 2026 6:02 PM IST
Chandampet
X

Chandampet: రైతుల విత్తన తిప్పలపై కలెక్టర్‌తో మాట్లాడిన కల్వకుంట్ల కవిత

చందంపేట: దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి రైతు వేదిక వద్ద వేరుశనగ విత్తనాల కోసం ఉదయం నుంచే అవస్థలు పడుతున్న మహిళా రైతుల తిప్పలు చూసి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చలించిపోయారు. డిండి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తూ సాయంత్రం తిరిగొచ్చేసరికి కూడా మహిళలు అక్కడే పడిగాపులు కాయడం చూసి ఆమె నేరుగా రైతు వేదికను సందర్శించారు.

​అధికారులు విత్తనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతమ్మలు ఆవేదన వ్యక్తం చేయడంతో కవిత వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గతేడాది 1100 క్వింటాళ్లు పంపిణీ చేయగా, ఈ ఏడాది కేవలం 600 క్వింటాళ్లే కేటాయించడం వల్ల తీవ్ర కొరత ఏర్పడిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన కలెక్టర్, ఉదయం నుంచి వేచి ఉన్న రైతులకు తక్షణమే విత్తన సంచులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన రైతుల వివరాలు నమోదు చేసుకుని అవసరమైన ఇండెంట్ పంపాలని ఆదేశించడంతో అధికారులు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda