Cheruvugattu: చెరువుగట్టులో అగ్నిప్రమాదం.. ఎమ్మెల్యే వీరేశం సాయం!
Cheruvugattu: చెరువుగట్టులో అగ్నిప్రమాదంతో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల వీరేశం ఒక్కొక్కరికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు.
Cheruvugattu: చెరువుగట్టులో అగ్నిప్రమాదం.. ఎమ్మెల్యే వీరేశం సాయం!
నల్లగొండ జిల్లా: చెర్వుగట్టులో అగ్ని ప్రమాదం: *20 దుకాణాలు దగ్ధం
20 వేల చొప్పున తక్షణ సాయం అందించిన ఎమ్మెల్యే వీరేశం*
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో దాదాపు 20 చిన్న దుకాణాలు పూర్తిగా బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అక్కడికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
ఒక్కో బాధితుడికి రూ.20 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని భరోసానిచ్చారు
Next Story




