Chinthapally: కేతావత్ చంద్రు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సంతాపం!
Chinthapally: చింతపల్లి బీఆర్ఎస్ నేత బిల్య నాయక్ సోదరుడు చంద్రు మృతికి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సానుభూతి తెలిపారు.
Chinthapally: కేతావత్ చంద్రు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సంతాపం!
చింతపల్లి: చింతపల్లి మండలం ప్రశాంతపురి తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్య నాయక్ సోదరుడు కేతావత్ చంద్రు మృతి చెందడం తీవ్ర బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.కేతావత్ చంద్రు మృతి పట్ల రవీంద్ర కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
కేతావత్ చంద్రు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, చింతపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




