Chinthapally: చింతపల్లి సాయి సన్నిధిలో మహాలక్ష్మి అవతారం.. 108 కలశాల అభిషేకం!

Chinthapally: చింతపల్లి సాయిబాబా ఆలయంలో శరన్నవరాత్రి వేడుకల్లో మహాలక్ష్మి అలంకారం, బాబా 108వ పుణ్యతిథి సందర్భంగా 108 కలశాలతో శుష్కఫల అభిషేకం, హరికథ సేవ.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 17 Oct 2026 7:09 PM IST
Chinthapally
X

Chinthapally: చింతపల్లి సాయి సన్నిధిలో మహాలక్ష్మి అవతారం.. 108 కలశాల అభిషేకం!

చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలో శ్రీ సాయి సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలలో ఈరోజు శనివారం "శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం", మహాలక్ష్మీదేవి హోమం, కుంకుమార్చన" మరియు "108 వ పుణ్యతిథి" (సమాధి) ఉత్సవాల సందర్భంగా 108 కలశాలతో శ్రీ సాయినాథుల వారికి శుష్కఫల (Dry Fruits) తో అభిషేకం జరిగింది.

తదుపరి శ్రీమతి బంగారు లక్ష్మీ భగవతారిణి గారిచే పార్వతీ కళ్యాణం హరికథా గానం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనంజయ మాట్లాడుతూ అమ్మవారి కటక్షాలు ప్రజల పై ఉండాలని కోరుకుంటూ ఇక్కడ రెండవ షిరిడిగా పేరుగాంచిన చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఇక్కడికి నలుమూలల నుండి ప్రజలు వచ్చే సాయినాధుని దర్శించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో టెస్ట్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA