Chityala: కాంగ్రెస్‌ 1000 రోజుల దగా పాలనపై గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం

Chityala: చిట్యాలలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బిఆర్‌ఎస్ వినూత్న నిరసన. బైక్ ర్యాలీ, వంటా-వార్పు చేపట్టి హామీలు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 4 Sept 2026 6:33 PM IST
Chityala
X

Chityala: కాంగ్రెస్‌ 1000 రోజుల దగా పాలనపై గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం

చిట్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెయ్యి రోజులుగా దగా పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా మూడో రోజు చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించిన బీఆర్‌ఎస్ శ్రేణులు, అనంతరం ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు, ప్లకార్డులతో నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ప్రభుత్వం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించగా, మహిళలతో కలిసి గండ్ర వెంకటరమణారెడ్డి స్వయంగా భోజనం వడ్డించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, స్కూటీలు, రైతులు, యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ప్రజా పాలన పేరుతో దగా పాలన సాగుతోందని ఆరోపిస్తూ, హామీలను వెంటనే అమలు చేయ

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally

Next Story