Chityala: చిట్యాల వద్ద ఘోర ప్రమాదం.. హైవేపై బోల్తా పడ్డ మూడు కార్లు!

Chityala: నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి NH-65 పై ఘోర రోడ్డు ప్రమాదం. మూడు కార్లు బోల్తా పడి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు. 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 28 Jun 2026 2:21 PM IST
Chityala
X

Chityala: చిట్యాల వద్ద ఘోర ప్రమాదం.. హైవేపై బోల్తా పడ్డ మూడు కార్లు!

చిట్యాల: చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారి-65పై ఘోర రోడ్డు ప్రమాదం. విజయవాడ వైపు వెళ్తున్న డి-మ్యాక్స్ V-Cross వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి హైదరాబాద్ వైపు రోడ్డుపై బోల్తా.

బోల్తా పడిన వాహనాన్ని హైదరాబాద్ వైపు వెళ్తున్న కియా కారు, మరో కారు ఢీకొట్టి బోల్తా. వరుసగా మూడు కార్లు బోల్తా పడడంతో హైవేపై తీవ్ర కలకలం. ప్రమాదంలో సుమారు 8 మందికి తీవ్ర గాయాలు.

క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్ వైపు సుమారు 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం.

ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్ , ఎన్ హెచ్ ఏ ఐ సిబ్బంది పోలీసులు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA

Next Story