Nalgonda: 22న నల్లగొండ కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి.. సీఐటీయూ

Nalgonda: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ (CITU) డిమాండ్. నల్లగొండలో ముగిసిన రెండు రోజుల నిరసన దీక్షలు, ఈ నెల 22న కలెక్టరేట్ ముట్టడికి పిలుపు.

SALEEM, BANSWADA
Published on: 19 Jun 2026 5:08 PM IST
Nalgonda
X

Nalgonda: 22న నల్లగొండ కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి.. సీఐటీయూ

Nalgonda: రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. సలీం డిమాండ్ చేశారు.

యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట చేపట్టిన రెండు రోజుల నిరసన దీక్షలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు సభలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ఈ నెల 22న చేపట్టబోయే జిల్లా కలెక్టరేట్ ధర్నాను కార్మికులంతా హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story