Nalgonda: నల్లగొండ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ భారీ ధర్నా

Nalgonda: నల్లగొండ ఆర్టీసీ డిపో వద్ద CITU ఆధ్వర్యంలో ధర్నా. సమ్మె ఒప్పందాలు, PRC బకాయిలు, పెండింగ్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని కార్మికుల డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 27 July 2026 5:13 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ భారీ ధర్నా

నల్లగొండ జిల్లా: సమ్మె ఒప్పందాలను వెంటనే అమలు చేయాలి: సీఐటీయూ

ఆర్టీసీలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడంతో పాటు పెండింగ్ అలవెన్సులు, పీఆర్సీ ఏరియర్స్, సమ్మె ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ ఆర్టీసీ డిపో ముందు కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె.ఎస్.రెడ్డి, నల్లగొండ డిపో గౌరవాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం, యాజమాన్యం ఒప్పందాల అమలులో తీవ్ర అలసత్వం వహిస్తున్నాయని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ చర్చల ప్రొసీడింగ్స్ కాపీలను వెంటనే సంఘాలకు అందజేయాలని కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story