Nalgonda: పోరాటాల ద్వారానే కార్మిక హక్కుల సాధన సిఐటియు నేతల పిలుపు!

Nalgonda: భీమ్ నగర్‌లో సిఐటియు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు. కార్మిక హక్కుల సాధనకు ప్రతిఘటన పోరాటాలే శరణ్యమని సిఐటియు సీనియర్ నేతలు స్పష్టం.

GOKARANNA,  GADWAL
Published on: 24 Aug 2026 7:01 AM IST
Nalgonda
X

Nalgonda: పోరాటాల ద్వారానే కార్మిక హక్కుల సాధన సిఐటియు నేతల పిలుపు!

Nalgonda: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రతిఘటన పోరాటాల ద్వారానే కార్మిక వర్గం తమ హక్కులను సాధించుకోగలదని సిఐటియు సీనియర్ నాయకులు ప్రసాద్,పుట్టా ఆంజనేయులు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లో నిర్వహించిన సిఐటియు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై,సిఐటియు విశిష్టత,కార్మిక వర్గంపై నయా ఉదారవాద విధానాల ప్రభావం అనే క్లాసులను బోధించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలతో రాజీ మార్గాల ద్వారా సమస్యల పరిష్కారం కాజాలవని, సంఘటిత ప్రతిఘటన పోరాటాల ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కార్మిక వర్గం తన హక్కులను సాధించుకోగలరని అన్నారు. కార్మిక వర్గం సృష్టించిన సంపదను వీకేంద్రీకరించడం చేతగాక, ఉత్పత్తి పై కార్మిక వర్గానికి హక్కు కల్పించకుండా కార్మిక వర్గం మధ్య విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు.

సిఐటియు కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి ఐక్యత,పోరాటం నినాదాలుగా కార్మిక వర్గ సమస్యలపై రాజీ లేని సమరశీల పోరాటాల నిర్వహిస్తూ, ఎంతో మంది CITU నాయకత్వాన్ని కోల్పోయిందని అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, వాటి వల్ల కార్మిక వర్గానికి జరిగే అన్యాయాలను వివరిస్తూ కార్మిక వర్గాన్ని సిఐటియు నిరంతరం చైతన్యం చేస్తున్నదని తెలిపారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story