Nalgonda: ఉద్యోగ భద్రత కల్పించాలి: వీవోఏల మహాధర్నా!
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్ ఎదుట వీవోఏలు ధర్నా చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచి బకాయిలు విడుదల చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.
Nalgonda: ఉద్యోగ భద్రత కల్పించాలి: వీవోఏల మహాధర్నా!
నల్గొండ: తమ సమస్యలను పరిష్కరించాలంటూ 'తెలంగాణ విలేజ్ అర్గనైజర్స్ సంఘం' (సీఐటీయూ) ఆధ్వర్యంలో వీవోఏలు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని మరియు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరిస్తూ పిడికిళ్ళు ఎత్తి నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.




