Nalgonda: ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిని గెలిపించండి: సీఐటీయూ!
Nalgonda: ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో ఎస్‌డబ్ల్యూఎఫ్ అభ్యర్థులను గెలిపించండి నల్లగొండ బహిరంగ సభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపు.
Nalgonda: ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిని గెలిపించండి: సీఐటీయూ!
నల్లగొండ: ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో ఎస్‌డబ్ల్యూఎఫ్ (SWF) కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఐటీయూ (CITU) జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు.
శనివారం నల్లగొండ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కార్మికులందరూ ఐక్యంగా నిలిచి ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమికి మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




