Nalgonda: చలో పార్లమెంట్ ధర్నాను జయప్రదం చేయాలి: సీఐటీయూ సలీం!

Nalgonda: నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం డిసెంబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించే 'చలో పార్లమెంట్' ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ కార్యదర్శి ఎండీ సలీం పిలుపునిచ్చారు.

Saleem, Nalgonda
Published on: 23 Nov 2026 5:11 PM IST
Nalgonda
X

Nalgonda: చలో పార్లమెంట్ ధర్నాను జయప్రదం చేయాలి: సీఐటీయూ సలీం!

Nalgonda: ​కార్మిక హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు నిర్వహించే 'చలో పార్లమెంట్‌' ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక డీఈవో కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని ఆయన విమర్శించారు. కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు లకపాక రాజు, దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్‌, అద్దంకి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda