Nakrekal: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రూ.315 కోట్లతో అభివృద్ధి పనులు!

Nakrekal: నకిరేకల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. 100 పడకల ఆసుపత్రి, సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం, మోడల్ స్కూల్ శంకుస్థాపన, రాజీవ్ గాంధీ స్టేడియంలో బహిరంగ సభ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Sept 2026 10:50 AM IST
Nakrekal
X

Nakrekal: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రూ.315 కోట్లతో అభివృద్ధి పనులు!  

Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు.

మునిపంపుల, కేచేపల్లి మండలం గుడివాలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు కంట్రోల్ రూం పనులకు శంఖుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనం.,ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మండల కార్యాలయాల సముదాయం, ఎక్సైజ్ భవనంతో పాటు ఇతరు అభివృధ్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టున్నారు.

రాజీవ్ గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.​

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story