Nalgonda: నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి వరుణ యాగం!
Nalgonda: నాగార్జునసాగర్ విజయ విహార్ ప్రాంగణంలో ప్రభుత్వం నిర్వహించిన మహా 'వరుణ యాగం'లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని సకల పూర్ణాహుతి సమర్పించారు.
Nalgonda: నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి వరుణ యాగం!
నల్గొండ: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, జలాశయాలు సమృద్ధిగా నిండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా ‘వరుణ యాగం’లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగార్జునసాగర్ తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంరక్షణలో ఈ యాగాన్ని వైభవంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, 108 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ 11 హోమగుండాల ద్వారా ఈ యాగ క్రతువు సాగింది. అనంతరం నిర్వహించిన మహత్తర 'సకల పూర్ణాహుతి' క్రతువులో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలు, హవిస్సులను సమర్పించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, పాడిపంటల అభివృద్ధి కోసం ప్రార్థించారు.




