Nalgonda: భూసేకరణ పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలి

Nalgonda: భూసేకరణ పరిహార చెల్లింపులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ బి. చంద్రశేఖర్. పెండింగ్ చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం.

Saleem, Nalgonda
Published on: 15 Sept 2026 7:58 PM IST
Nalgonda
X

Nalgonda: భూసేకరణ పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలి

నల్గొండ: జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. భూసేకరణ పురోగతిపై మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిండి, చింతపల్లి, పెండ్లిపాకల, శివన్నగూడెం తదితర రిజర్వాయర్లకు సంబంధించి నిధులు విడుదలైనందున పెండింగ్ చెల్లింపులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అవసరమైన చోట జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశాలు ఏర్పాటు చేయాలని, చెల్లింపుల్లో ఎలాంటి తప్పులు జరగకూడదని స్పష్టం చేశారు. భూములకు సంబంధించిన అవార్డు, అలైన్‌మెంట్, మ్యాప్, జియో కోఆర్డినేట్ వివరాలతో పూర్తిస్థాయి ఫైళ్లు నిర్వహించాలని అధికారులకు నిర్దేశించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda