Nalgonda: కరువు నీడలో నల్లగొండ..వరి ఆశలు వదులుకోవాల్సిందే..కలెక్టర్!
Nalgonda: ఎల్ నినో ప్రభావంతో నల్లగొండ జిల్లాలో తగినంత వర్షపాతం నమోదయ్యే అవకాశం లేనందున, రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు.
Nalgonda: కరువు నీడలో నల్లగొండ..వరి ఆశలు వదులుకోవాల్సిందే..కలెక్టర్!
నల్గొండ: ఎల్ నినో ప్రభావంతో తగినంత వర్షపాతం నమోదయ్యే అవకాశం లేనందున, జిల్లాలోని రైతులు వరి ఆశలు వదులుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
ఇంకా వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు తీవ్రంగా నష్టపోతారని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఈఓలు గ్రామస్థాయికి వెళ్లి, రైతులను నేరుగా కలిసి కంది, మినుము, జొన్న, కూరగాయల సాగు వల్ల కలిగే లాభాలను వివరించాలని స్పష్టం చేశారు.
Next Story




