Miryalaguda: ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి కలెక్టర్ చంద్రశేఖర్
Miryalaguda: మిర్యాలగూడలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి బీఎల్ఓలకు కీలక ఆదేశాలిచ్చిన కలెక్టర్ బి.చంద్రశేఖర్.
Miryalaguda: ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి కలెక్టర్ చంద్రశేఖర్
మిర్యాలగూడ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ బి ఎల్ ఓ లను ఆదేశించారు. శనివారం అయన మిర్యాలగూడ మున్సిపాలిటీ లో 3 వ వార్డులో 133,134 పోలింగ్ కేంద్రాల పరిధిలో బి ఎల్ ఓ లు నిర్వహిస్తున్న "సర్" కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఎన్యుమరేషన్ ఫారాలలో 2002 జాబితాలో ఉన్న వారి వివరాలు,లేని వారి వివరాలు నమోదు ,అలాగే బి ఎల్ ఓ లతో పాటు ఉన్న ఫారం 6,7,8 ,ల పై అడిగితెలుసుకున్నారు.ఈ సందర్బంగా బి ఎల్ ఏ లు సర్ కార్యక్రమానికి సహకరిస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.
సర్ కార్యక్రమాన్ని పూర్తి జాగ్రత్తగా నిర్వహించాలని,తప్పులు ఉండరాదని ,పారదర్శకంగా ఉండాలనిచెప్పారు.ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన వారందరు తిరిగి ఇస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.ఎవరైనా అందుబాటులో లేకుంటే మరో సారి ఆ ఇంటిని సందర్శించి అలాంటి వారి వివరాలు కూడా నమోదు చేయాలని సూచించారు.




